కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఉత్తమ్ - V2News

Latest News

V2News

Monday, June 15, 2020

కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఉత్తమ్

V2NEWS DESK : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా టాస్క్ ఫోర్స్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తీర్మానించిన అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షల చార్జీలను ప్రభుత్వమే భరించాలని, తెలంగాణలో ఐసీఎంఆర్ అనుమతులు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేయాలని తీర్మానించినట్టు తెలిపారు. పాత జిల్లా కేంద్రాలు అన్నింటిలో కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సాకుగా చూపిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీపైనే విధిస్తున్న ఆంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.