అత్తింటి వేధింపులను భరించలేక డెంటల్​ డాక్టర్ ఆత్మహత్య - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

అత్తింటి వేధింపులను భరించలేక డెంటల్​ డాక్టర్ ఆత్మహత్య

అదనపు కట్నం తీసుకరావాలంటూ  అత్తింటి వేధింపులను భరించలేక  నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువ డెంటల్​ డాక్టర్​ బండారు శ్వేత ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల..  2009లో ప్రభుత్వ డాక్టర్​ బండారు కుమార్​తో వివాహం జరిగిన నాటి నుంచి కట్నం అత్త నుంచి ఆడబిడ్డ వేధింపులు మొదలయ్యాయని శ్వేత తండ్రి గవర్నమెంట్​ ఉపాధ్యాయుడు అనంతుల నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒడి బియ్యం వేడుక నేపద్యంలో శ్వేతకు వారి అత్తింటి వారికి ఘర్షణ చోటు చేసుకుందని చెప్పారు. నా బిడ్డతో మాట్లాడకుండా అడగడున అడ్డుపడి చివరకు నా బిడ్డ ఉరివేసుకుని చనిపోయేలా చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. మంగళవారం రాత్రి ఘర్షణ పడిన విషయం తెలియటంతో అల్లుడు కుమార్​కు ఫోన్​ చేస్తే స్టుపిడ్​ నాకు ఫోన్​ చేయొద్ధంటూ పెట్టేశాడన్నారు. చివరకు నా చంద్రబింబం లాంటి కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.