ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి



సంగారెడ్డి : ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వ్యవసాయ, ఉద్యాన ,మత్స్య, పశుసంవర్ధక, ఇరిగేషన్, గ్రామీణ అభివృద్ధి, పౌరసరఫరాలు, షుగర్ కేన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఆయా శాఖలు ఖచ్చితమైన ప్రణాళికలను తయారుచేయాలని సూచించారు. జిల్లా మొత్తం పరిగణలోకి తీసుకుని రైతులు  పంటలు పండిస్తున్నారు, ఎంత ఉత్పత్తి వస్తుంది, పంటల విస్తీర్ణం పెంచాల్సి ఉంది అన్న వివరాల నివేదికను అందించాలని  సూచించారు. డిమాండ్కు తగ్గ పంటలు పండించే దిశగా రైతులను సిద్ధం చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టడానికి వీలున్న పనులను రైతులతో అనుసంధానం చేసి రైతులను  ప్రోత్సహిం చేల ప్రణాళిక చేయాలని సూచించారు. అన్ని రకాల కూరగాయలు పండించే విధంగా ఎక్కువ మంది రైతులను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ అధికారి సునీతకు చెప్పారు. నర్సరీలను పెంచడంలో ఆసక్తి గలవారిని ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా ఖరీఫ్ కు అవసరం అయిన ఎరువులు విత్తనాలకు సంబంధించి అంచనాలను ఇవ్వాలని  సూచించారు. జిల్లాలో ఇరిగేషన్
tanks 
కింద సేద్యం అవుతున్న పంట వివరాలను ఇరిగేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు . వ్యవసాయ పరంగా ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో విధంగా ఉంటుంది అన్న వివరాలను సేకరించాలని, విధంగా చేస్తే బాగుంటుందో తదితర సూ చనలతో నివేదిక నందించాలని  సూచించారు. ఆయకట్టు కింద అంచనాలను తెలపాలన్నారు. యాక్షన్ ప్లాన్ లో పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలో స్పష్టంగా సూచించాలని తెలిపారు. మత్స్య శాఖకు సంబంధించి ట్యాంక్ వైజ్  సమాచారాన్ని, కావలసిన చేప పిల్ల విత్తనాలు అదేవిధంగా అవసరమైన పనిముట్లకు సంబంధించిన నివేదికను అందించాలని మత్స్యశాఖ అధికారి సుజాతకు సూచించారు. జిల్లాలో పాడి పరిశ్రమ ,పౌల్ట్రీ తదితరాలకు సంబంధించి విధంగా ఉంది ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇంకా ప్రొడక్షన్ పెంచే అవకాశం, తదితర వివరాల ప్రణాళికతో  నివేదికను అందించాలని  రామారావు రాథోడ్ కు ఆదేశించారు. రైతులు జిల్లాలో పండిస్తున్న పంటలు ఎంత ,జిల్లాకు అవసరమున్నది ఎంత, ఏదేని షార్ట్ ఫాల్ ఉంటే ఇంక్రీజ్ ఎలా చేయాలి అన్న ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలన్నారు. ఎక్కువగా రైతులు పత్తి, సోయాబీన్, షుగర్ కేన్ , వరి, కందులు, పెసర  పంటలు పం డిస్తున్నట్లు దృష్టికి వచ్చింద్నారు. రైతులను అంతర్ పంటలు వేసేలా ప్రోత్సహించాలని, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచే అవకాశం ఉంటుందన్నారు. భూమిలో పంటలు పండుతాయో గుర్తించి మేరకు వేసేలా చూడాలన్నారు. ఏరియాలో రకం భూమి ఉందో వివరాలు అందించాలని ఆయన అధికారులకు  సూచించారు. సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు, వ్యవసాయశాఖఅధికారి నర్సింగరావు, ఉద్యానశాఖఅధికారి సునీత, పశుసంవర్ధక శాఖ అధికారి రామారావు
rathod,
మత్స్యశాఖ అధికారి సుజాత, పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి,  డీమ్ సుగుణబాయ్, సిపిఓ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.