పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, వలసకూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. 'పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి.. వారి బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను' అని చెప్పారు.

'చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలి. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలి. భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర. భవిష్యత్తులోనూ వారు కీలక భాగస్వాములుగా ఉంటారు. వలస కార్మికులకు ఇప్పుడు డబ్బు అవసరం' అని రాహుల్ గాంధీ తెలిపారు.

'ప్రభుత్వం వారికి సాయాన్ని అందించాలి. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, కూలీలు పడుతున్న ఆవేదనను చూపిస్తోన్న జర్నలిస్టులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.