ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు

V2డెస్క్  : చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా అమెరికాలో ఈ వైరస్ ధాటికి 89,595 మంది మరణించారు. గత 24 గంటల్లోనే అక్కడ వెయ్యికి పైగా మృతి చెందారు. ఇతర దేశాల్లోనూ కరోనా కారణంగా భారీ సంఖ్యలో కన్నుమూశారు.

కరోనాతో ఏ దేశంలో ఎంతమంది మరణించారంటే...

యూకే-34,466
ఇటలీ-31,763
ఫ్రాన్స్-27,625
స్పెయిన్-27,563
బ్రెజిల్-15,633
బెల్జియం-9,005
జర్మనీ-8,027
ఇరాన్-6,937
కెనడా-5,679
నెదర్లాండ్స్-5,670
మెక్సికో-4,767
చైనా-4,633
టర్కీ-4,096
స్వీడన్-3,674
భారత్-2,871
ఈక్వెడార్-2,688
రష్యా-2,537
పెరూ-2,523
స్విట్జర్లాండ్-1,879
ఐర్లాండ్-1,533
పోర్చుగల్-1,203
రుమేనియా-1,094
ఇండోనేషియా-1,089