మంగళవారం అర్థరాత్రి నేపాల్‌లో భూకంపం - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

మంగళవారం అర్థరాత్రి నేపాల్‌లో భూకంపం

గత అర్ధరాత్రి నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. మంగళవారం అర్ధ రాత్రి సరిగ్గా 11:53 గంటలకు పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. భూకంప ప్రభావంతో ఖఠ్మాండూ, కాస్కీ, పర్సా, సింధుపల్‌‌చోక్ తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా ఎవరూ గాయపడినట్టు కానీ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు.