రేగోడ్ మండల జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

రేగోడ్ మండల జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ

రేగోడ్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రాణాలను లెక్క చేయకుండా నిరంతరం వార్తలను అందిస్తున్న రేగోడ్ మండల జర్నలిస్టులకు zptc యాదగిరి, మండల పరిషత్తు కో అప్షన్ సభ్యుడు చోటు భాయ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్న జర్నలిస్టుల సేవలు మరువలేనివని దాతలు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మున్నూరు కిషన్, వైస్ mpp వినీల, సర్పంచ్ లు నర్సింలు, సునీల్, pacs మాజీ చైర్మన్ శంరావు కులకర్ణి, మాజీ సర్పంచ్ ఎం. విజయభాస్కర్,  కొండాపూర్ mptc శ్రీకాంత్ నాయక్, పార్టీ ఉపాధ్యక్షులు గంజి సంగమేశ్వర్, పెద్ద తండా ఉప సర్పంచ్ సాంగ్యానాయక్, pacs డైరెక్టర్ లు శివాజీ రావ్, సాయాగౌడ్, నారాయణ, రామాగౌడ్, మల్లికార్జున్, అక్బర్, ఆనందం, సంగారెడ్డి, ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు తూర్పు సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు విట్టల్ రావ్, ఉపాధ్యక్షులు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి షఫీ, కార్యదర్శి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.