ఫోటోగ్రాఫర్ ల సమస్యలు పరిష్కరించాలి :సంఘం అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

ఫోటోగ్రాఫర్ ల సమస్యలు పరిష్కరించాలి :సంఘం అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి



హైదరాబాద్ : లాక్ డౌన్ కారణంగా  ఫోటోగ్రాఫర్ల సమస్యలు పరిష్కరించాలని బుధవారం సాంస్కృతిక శాఖ మాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్ ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు . దీనికి మంత్రిగారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తానని  సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో గ్రాఫర్ ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి , కన్వీనర్ మునగాల శైలేందర్, కన్వీనర్ బి. నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుర్రం జంగారెడ్డి, పాల్గొన్నారు.