పరిశ్రమల యాజమాన్యాలు కోవిడ్ గైడ్ లైన్స్ విధిగా పాటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సోమవారం పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలోకోవిడ్ నివారణ కు తీసుకుంటున్న చర్యలు, కావాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలన్నీ కోవిడ్ జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. పరిశ్రమలు బాగా నడవాలని అందుకు ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఇస్తున్నామన్నారు.వైజాగ్ ప్రమాద ఘటన తో జిల్లాలో అప్రమత్తం చేసినప్పటికీ ,ఇటీవల జిల్లాలో జరిగిన ప్రమాద సంఘటనలు బాధాకరమని పేర్కొన్నారు.
కరొనా కట్టడికి పరిశ్రమల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో సహకరించాలని, అదే విధంగా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, షిఫ్టు సిస్టంలో సిబ్బందిని పెట్టు కోవాలని చెప్పారు. ఫ్యాక్టరీ బస్సుల్లో, పనిచేసే చోట భౌతిక దూరం పాటించాలన్నారు. కార్మికులకు మాస్క్ లను, శాని టైజ ర్ అందుబాటులో ఉంచాలని , తప్పని సరిగా మాస్కు ధరించాలన్నారు. కార్మికులకు,యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సూచించారు.
కోవి డ్ జాగ్రత్తలు తీసుకోకుండా ,నిర్లక్ష్యం వహించే పరిశ్రమల పై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, అధికారులు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, పరిశ్రమలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలన్నారు.
కొన్ని పరిశ్రమలయాజమాన్యాలు బస్సు లలో కనీస దూరం లేకుండా కార్మికులు ను తరలిస్తున్నట్లు దృష్టి కి వచ్చిందన్నారు. బాయిలర్, ఫైర్ , సేఫ్టీ వాళ్ళు సరిగా ఇండస్ట్రీ లను చెక్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించాలని సూచించారు.
జిల్లా లో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాల లో 20 మంది చనిపోయారని,19 మంది వికలాంగులు అయ్యారని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలపై అధికారులపై ఉందన్నారు.
పరిశ్రమల నుంచి రాత్రి సమయం లో విష వాయువులు వదులుతున్నట్లు దృష్టి కి వచ్చిందని,
సేఫ్టీ ఆఫీసర్స్ ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలన్నారు. గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కంపెనీ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పారిశ్రామిక యాజమాన్యాలతో ఏవేని ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ,వాటిని పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం ముందు ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలనుండి కార్మికులను తెచ్చుకోవ డాని కి అనుమతి ఇస్తామని తెలిపారు. పారిశ్రామిక యాజమాన్యాలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ,ఏ సపోర్ట్ కావాలన్నా జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08455-272525 కు ఫోన్ చేయాలని మంత్రి తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం యావత్ ప్రపంచం క రోనా విపత్తు తో బాధపడు తుం దని, ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, పరిశ్రమలు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలన్ని పాటించాలన్నారు. స్టాండ్ సాని టైజర్ ను ఏర్పాటు చేయాలని , విధిగా మాస్క్ దరించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని కోరారు.పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు పరిశ్రమల లో సేఫ్టీ క్యాషన్స్ తీసుకొని నడిపించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ ,మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, dccb చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లు రాజర్షి షా, వీరారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.
Monday, May 18, 2020
Home
Unlabelled
పరిశ్రమల యాజమాన్యాలు కోవిడ్ గైడ్ లైన్స్ విధిగా పాటించాలి :మంత్రి హరీష్ రావు
పరిశ్రమల యాజమాన్యాలు కోవిడ్ గైడ్ లైన్స్ విధిగా పాటించాలి :మంత్రి హరీష్ రావు
About V2News
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.