లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు - V2News

Latest News

V2News

Tuesday, May 19, 2020

లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు

V2DESK: దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు మంచి లాభాల్లోనే సూచీలు కొనసాగుతున్న సమయంలో... ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో అప్పటి వరకు ఉన్న లాభాలను సూచీలు కొంతమేర కోల్పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్ల లాభంతో 30,196 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 8,879 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (11.34%), ఓఎన్జీసీ (5.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.96%), ఐటీసీ (3.74%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.33%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.39%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.26%), ఎల్ అండ్ టీ (-2.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.64%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%).