కరోనకాలంలో ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

కరోనకాలంలో ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి

                                     కలెక్టరేట్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్లకార్డులతో ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

                       ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న టి డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై ప్రభాకర్. 

- ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం మీడియా అకాడమీ ద్వారా నెలకు పదివేల రూపాయలు చెల్లించాలి
-రూ 25 లక్షలు ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలి
-టి డబ్ల్యూ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ 
-మంత్రి హరీష్ రావు కు వినతి 
-మంత్రి సానుకూల స్పందన



కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లక్డౌన్  వల్ల మీడియా రంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందని,  మీడియా రంగాన్ని ఆదుకోవాలని టీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. మవారం టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉద్యోగ ఉపాధి కోల్పోయి లాక్ డౌన్లో ప్రత్యన్మయం  లేక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారని .  ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టు ప్రభుత్వం మీడియా అకాడమీ ద్వారా నెలకు రూ 10 వేల చొప్పున చెల్లించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములవుతున్నారని,  జర్నలిస్టులకు రూపాయి 25 లక్షల ఇన్సూరెన్స్ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలన్నారు.అలాగే జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు మాస్కులు టైలర్ పంపిణీ చేయాలని , అందరికీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఆలాగే మీడియా  సంస్థలో జర్నలిస్టులు అక్రమ తొలగింపులు ను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్ల్లా,  మండల కేంద్రాలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు హెల్త్కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.మీడియా అకాడమీ ద్వారా చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇస్తున్న లక్ష రూపాయల సహాయాన్ని రూ.ఐదు లక్షల పెంచాలన్నారు. అలాగే పదవి విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు.దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్యను పరిష్కరించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.అంతకు ముందు టీడబ్ల్యూజేఫ్ జిల్లా నాయకులు, రాష్ట్ర   ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కు కలిసి వినతి  పత్రాన్ని సమర్పించి తమ డిమాండ్లను తెలియజేయడం జరిగింది.అందుకు స్పందించిన మంత్రి  హరీష్ రావు  జర్నలిస్టులకు న్యాయం  చేస్తామని, తమ ప్రభుత్వ ఆలోచనలో ఉందని సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు రవి కొండల్ ,జిల్లా కోశాధికారి ఎం. అశోక్ బాబు,  జిల్లా ఉపాధ్యక్షులు పాండు,  జిల్లా నాయకులు రాజు,  దేవదాసు, దండు ప్రభు, రాజుగౌడ్,  తదితరులు పాల్గొన్నారు.