CM KCR Inaugurated Kondapochamma Sagar Project - V2News

Latest News

V2News

Friday, May 29, 2020

CM KCR Inaugurated Kondapochamma Sagar Project

V2NEWS : CM KCR Inaugurated Kondapochamma Sagar Project

సిద్దిపేట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంబించారు. కార్యక్రమానికి త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ దేవాలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు చండీయాగం నిర్వహించారు. చండీయాగం పూర్ణాహుతిలో కేసిఆర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఎర్రవల్లి,మర్కుక్ లలో రైతు వేదికలకు భూమి పూజ చేశారు. మర్కూక్‌ పంప్‌హౌజ్‌ దగ్గర నిర్వహించిన సుదర్శనయాగంలో కేసిఆర్ దంపతులు పూర్ణాహుతిలో చినజీయర్ తో కలిసి పాల్గొన్నారు. తదనంతరం మర్కుక్ పంప్ హౌజ్ ను కేసీఆర్ ప్రారంబించారు. తరువాత గోదావరి జలాలకు స్వాగత హారతి ఇచ్చారు. అనంతరం వరదరాజుపూర్‌ లోని రాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ లు చెసి మర్కూక్‌ పంపుహౌజ్‌ వద్ద ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.