కొల్లేరులో పర్యటించిన మంత్రి పేర్ని నాని .. - V2News

Latest News

V2News

Monday, June 15, 2020

కొల్లేరులో పర్యటించిన మంత్రి పేర్ని నాని ..

V2NEWS  కైకలూరు : కొల్లేరు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రవాణా ,సమాచార శాఖ మంత్రి శ్రీ పేర్ని నాని , కృష్ణా జిల్లా కలెక్టర్ ,జాయింట్ కలెక్టర్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే  డిఎన్ఆర్  ఆ  ప్రాంతంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లేరు సంఘ అధ్యక్షులు నాభిగారి రాంబాబు, వైఎస్సార్ సీపీ బిసి సెల్ రాష్త్ర కార్యదర్శి ముంగర నరసింహారావు స్థానికంగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. సర్కారు కాలువ పై వంతెన, కొల్లేటికోట పి.హెచ్.సి సెంటర్లఆధునికీకరణ పందిరిపల్లి గూడెం - శృంగవరప్పాడు గ్రామ సచివాలయం నిర్మాణం , ఉపాధి హామీ పనులు మరిన్ని రోజుల కొనసాగింపు , మంచి నీటి సమస్య పరిష్కారం కొరకు  వాటర్ ట్యాంకర్ తో నీరు సప్లై , కొల్లేరు గ్రామాల్లో కరెంటు లోఓల్టేజీ సమస్య పరిష్కారం కొరకు ట్రాన్స్ఫార్మర్స్ కెపాసిటీ పెంచటం , కొల్లేరు ఆపరేషన్లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల భూమి విషయంలో సీఎం గారితో చర్చలకు అపాయింట్మెంట్ తీసుకోవడం, మత్స్యకార భరోసా పథకంలో కొల్లేరు పేద ప్రజలను, మత్స్యకారులను చేర్చడం ,    వలలు , వెదురు గెడలు , తాటి ధోనెలు, వేట సామాగ్రి సబ్సిడీపై ఇప్పించడం వంటి పలు అంశాలను మంత్రి దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కొల్లేరు సమస్యల పరిష్కారం కోసం మంత్రి ని, కలెక్టర్లను కొల్లేరుకు  తీసుకొని వచ్చిన  కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గారికి గారికి కొల్లేరు ప్రజల తరఫున నరసింహారావు , రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు.