90అడుగులు వాసవీమాత విగ్రహం ఏర్పాటు:మాజీ ముఖ్యమంత్రి రోశయ్య - V2News

Latest News

V2News

Tuesday, January 8, 2019

90అడుగులు వాసవీమాత విగ్రహం ఏర్పాటు:మాజీ ముఖ్యమంత్రి రోశయ్య



అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అద్వర్యం లో సోమజిగూడా లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తమిళనాడు మాజీ గవర్నర్, ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ పెనుగొండ లో శ్రీ వాసవి మాతా 90 అడుగుల పంచలోహ విగ్రహం ఫిబ్రవరి 14 వ తేదీన ఆవిష్కరించబడునని కులమతాలకు అతీతంగా వాసవి మాత ను అందరు పూజిస్తారని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవింద రాజు,రాంపండు, రవి శంకర్,మాల్లాద్రి తదితరులు పాల్గొన్నారు.