ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్. - V2News

Latest News

V2News

Tuesday, January 8, 2019

ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.



చిత్తూరు జిల్లా నందు భారీ ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు ఎర్రచందన స్మగ్లర్ లు అరెస్ట్
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్ పి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ శ్రీ కె. కృష్ణార్జునరావు గారి అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరంతర వాహనాల తనికీలు, గుప్త సమాచార సేకరణ జరుగుచున్నది. ఈ క్రమంలో ఈ నెల ౦5.01.2019 వ తేదిన అడిషనల్ ఎస్పి ఆపరేషన్స్ శ్రీ కె. కృష్ణార్జునరావు గారికి రాబడిన పక్క సమాచారం మేరకు ఈ రోజు ఉదయం సుమారు 4.00 గంటలకు డి ఎస్ పి టాస్క్ ఫోర్సు, శ్రీ వి.వి. గిరిధర్ గారి నేతృత్వంలో శ్రీ వీరేశ్, ఆర్.ఐ, SBX ఎస్.ఐ శ్రీ మల్లికార్జున, ఎస్.ఐ చిత్తూరు తాలుకా ఎస్.ఐ శ్రీ భాస్కర్ మరియు వారి సిబ్బంది మాపాక్షి క్రాస్, చిత్తూరు తాలూకా (మం.) వద్ద వాహనములను తనికీ చేయు చుండగా అనుమానాస్పదంగా ఉన్న ఒక సఫారీ వాహనము పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా పోలీసు వారు వెంబడించి పట్టుకొని వాహనంను తనికి చేయగా అందులో 2 ఎర్రచందనం దుంగలను కనుగొనబడ్డాయి, వాహనంలో దొరికిన ముద్దాయిని విచారించగా తీగ లాగితే డొంక కదిలినట్లు నరిగిపల్లె గుట్ట వద్ద ఎర్రచందనం దుంగల డంప్ వున్నదని తెలిసి అచ్చట వెళ్లి తనికి చేయగా డంప్ కు కాపలా వున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 2 టన్నుల బరువు గల 69 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసు కోవడం జరిగినది. ముద్దాయిల వివరములు 1. యం. పుల్ల రెడ్డి, వయస్సు 30 సం. s/o రామి రెడ్డి, గాజులపల్లె గ్రామం, మహానంది ( మం. ), కర్నూల్ జిల్లా. 2. బి.మస్తాన్ వల్లి, వయస్సు 40 సం. s/o మస్తాన్ వల్లి, బోయలకుంట్ల గ్రామం, సేరివెల్ల (మం.), కర్నూల్ జిల్లా.