బిల్డింగ్ పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య. - V2News

Latest News

V2News

Tuesday, January 8, 2019

బిల్డింగ్ పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య.



కృష్ణాజిల్లా పెడన లోని విజయానంద డిగ్రీ కళాశాల లో దారుణం చోటుచేసుకుంది కళాశాల భవనం పై నుండి దూకి పామర్తి అలేఖ్య అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది అక్కడే ఉన్న తోటి విద్యార్థులు సిబ్బంది ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు కాలేజీ ఫీజు కట్టలేదని అందరి ముందు నిలదీయడం తో పాటు క్లాస్ బయటపెట్టిన ఎందుకు మనస్థాపానికి గురైన అలేఖ్య ఘాతుకానికి పాల్పడింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు