ఓయూ పూర్వవిద్యార్థులు హాస్టళ్లుఖాళీచేయాలి :విసీ రామచంద్రం - V2News

Latest News

V2News

Tuesday, January 8, 2019

ఓయూ పూర్వవిద్యార్థులు హాస్టళ్లుఖాళీచేయాలి :విసీ రామచంద్రం



ఓయూ లో కోర్సు కాలం పూర్తి చేసుకున్న పరిశోధక విద్యార్థులు , పీజీ విద్యార్థుల తో పాటు నాన్ బోర్డర్లు వసతి గృహాలు వెంటనే ఖాళీ చేయాలనీ ఓయూ వీసీ ప్రో , రామచంద్రం ఆదేశాలు జారీచేశారు. నాన్ బోర్డార్లు ఖాళీ చేయని పక్షం లో త్వరలో పోలీసుల సహకారం తో హాస్టల్ లు తనిఖీలు నిర్వహిస్తామని వైస్ ఛాన్సులర్ వెల్లడించారు. నాన్ బోర్డర్లు నివాసం ఉండటంతో ఇటీవల అడ్మిషన్ పొందిన PH.d , పీజీ నూతన విద్యార్థులు హాస్టల్ గదులు కాళీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీంతో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇటీవలే పిహెచ్ .డి, పీజీ విద్యార్థులు హాస్టల్ వసతి కలిపించాలని పలు సార్లు వినతి పత్రాలు ఇచ్చారని వీసీ వెల్లడించారు. అందువల్ల నాన్ బోర్డులలు ఖాళీ చేయకపోతే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని వీసీ తెలిపారు.