మహారాష్ట్రలో 30వేల కేసులు, 1135 మరణాలు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

మహారాష్ట్రలో 30వేల కేసులు, 1135 మరణాలు



V2 డెస్క్ : కొవిడ్‌-19 మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1606పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30,706కి చేరింది. ఇక ఈ వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 67మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌-19 సోకి మరణించినవారి సంఖ్య 1135కి చేరింది. గుజరాత్‌లోనూ కరోనా తీవ్రత కలవరపెడుతోంది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 1057 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు గుజరాత్‌లో మొత్తం 10,988 కేసులు నమోదు కాగా 625మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 4789 మందికి ఈ వైరస్‌ సోకగా 243మంది మరణించారు