తమిళనాడు, రాజస్థాన్‌లలో విజృంభణ - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

తమిళనాడు, రాజస్థాన్‌లలో విజృంభణ


V2డెస్క్ : తమిళనాడులో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 477మంది ఈవైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10,585కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 74మంది ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని దిల్లీలో ఈ వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 9333కి చేరింది. వీరిలో 129మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 2576 కేసులు నమోదుకాగా 232మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 126కు చేరగా 4960 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి