మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు? - V2News

Latest News

V2News

Friday, May 15, 2020

మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు?

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. మూడో విడత లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. అయినప్పటికీ దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మరికొన్ని సడలింపులు ఇచ్చి.. మే 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో విడత లాక్ డౌన్ పొడిగింపుపై శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి.