ఏదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు : మంత్రి కేటీఆర్ ట్వీట్ - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

ఏదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు : మంత్రి కేటీఆర్ ట్వీట్

వారాంతంలో నింపాదిగా ఆలోచిస్తుంటే లాక్ డౌన్ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చన్న ఊహ జనించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రతి ఒక్కరూ తమలో తాము ఇలా ఆలోచించే అవకాశం ఉందంటూ వివరించారు.
"ఇక్కడెవరూ సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన దిశగా మిమ్మల్ని మీరు నడిపించుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. రుచికరమైన ఆహారం భోంచేయండి. సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాయిగా నడవండి. సముద్రంలో దూకండి. హృదయాన్ని ఓ పెన్నిధిలా పొదివిపట్టుకు తిరుగుతున్నామన్న సత్యాన్ని చాటిచెప్పండి. అప్పుడప్పుడు సిల్లీగా ఉండండి. కొంచెం దయతోనూ వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు. అన్ని ఇప్పుడే చేసేయండి" అంటూ సరదాగా ట్వీట్ చేశారు