నాలుగో దశ లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను శనివారం సాయంత్రం విడుదల - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

నాలుగో దశ లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను శనివారం సాయంత్రం విడుదల

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో నాలుగో దశ లాక్‌డౌన్‌ విధించి, మినహాయింపులకు సంబంధించిన వివరాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. లాక్‌డౌన్ నూతన మార్గదర్శకాలను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనుంది. దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉన్న రెడ్‌జోన్లలో తప్ప మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థకు సడలింపులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఈ నెల 17తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా, 18 నుంచి లాక్‌డౌన్‌కు కొత్త రూపు రానుందని ఇటీవల ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  తొలి దశ లాక్‌డౌన్‌లో తీసుకున్న పలు చర్యలు రెండో దశలో తీసుకునే అవసరం లేదని, రెండో దశలో తీసుకున్న పలు చర్యలను మూడో దశలో తీసుకోలేదని మోదీ ఇటీవల సీఎంలతో అన్నారు. మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో తీసుకునే అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. దీంతో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.