పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో చోటు చేసుకుంది.
కల్హేర్ మండలంలో పోమ్యానాయక్ తండా కు చెందిన సుదర్శన్ తోపాటు మొదళ్లకుంట తండాకు చెందిన కేతావత్ రవీందర్ సొంత చేనులో పనినిమితం వెళ్లగా వారిపై పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకొని ఊపిరి ఇచ్చి ఎంత ప్రయతించిన అప్పటికే వారు మృతి చెందారు . పోమ్యానాయక్ తండాకు చెందిన సుదర్శన్ 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి కాగా .. లాక్ డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లోనే ఉంటున్నసుదర్శన్ పొలం వరకు వెళ్లివస్తాన్నని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. గాలి వర్షం రావడంతో తన పొలంలోనే ఆగిపోయాడు . అంతలోనే అతనిపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మొదళ్లకుంట తండాకు చెందిన కేతావత్ రవీందర్ పొలంలో పని చేస్తుండగా అతనిపై పిడుగు పడి అక్కడిక్కకడే మృతి చెందాడు. దీనితో కల్హేర్ మండలంలోని రెండు తండాలలో విషాదఛాయలు నేలుకున్నాయి.