పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం : నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం : నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం  కల్హేర్ మండలంలోని వివిధ తండాల్లో పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. పిడుగుపాటుతో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కల్హేర్ మండలంలోని పొమ్యా నాయక్ తండాలో పదోతరగతి విద్యార్థి సుదర్శన్ చని పోవడం విశాధకరమన్నారు. అదేవిధంగా నాగధర్ తండా లోనూ యువరైతు రవీందర్ చనిపోవడం కూడా బాధించ దగ్గ విషయమన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని యూవ రైతుకు రైతు భీమా ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు. అదే విధంగా విద్యార్థి కుటుంబానికి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.