శ్రీశైలం దేవస్థానం పరిశీలనకు కేంద్రబృందం - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

శ్రీశైలం దేవస్థానం పరిశీలనకు కేంద్రబృందం

డా. మధుమిత దుబే , డైరెక్టర్ డా. సంజయ్ కుమార్ సాదు ఖాన్.ప్రతినిధుల తో కూడిన కేంద్ర  బృందం శ్రీశైలం దేవస్థానం పరిశీలనకు శనివారం వచ్చింది . శ్రీశైలం మాడ వీధులు దర్శనం క్యూలైన్లు, కరోనా వ్యాధి నిరోధక ద్వారాలను, క్యూలైన్లలో  భౌతిక  దూరాన్ని పాటింపజేసేందుకు ఏర్పాట్లు , సూక్ష్మ క్రిమి నిరోధక ద్వారాలను బృందం లోని సభ్యులు పరిశీలించారు. భక్తులను దర్శనానికి అనుమతించే టప్పుడు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్రబృంద ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్  కు ముందు లాక్ డౌన్  ప్రకటించిన తర్వాత శ్రీశైలదేవస్థానంలో చేప్పట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం భ్రమరాంబ అతిథిగృహం లోని సమావేశమందిరంలో స్థానిక వైద్యులతో, కార్యనిర్వహణాధికారి. కె ఎస్. రామరావు తో సమావేశమై పలుసుచనలు చేశారు. ప్రజలు  ముందస్తు జాగ్రత్తలు తీసుకోనేవిదంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.