మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు. అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. మార్గంమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి దయనీయ పరిస్థితిని చూసి సహాయం చేశారు. నితేశ్ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.