మెరుగైన చికిత్స విధానం - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

మెరుగైన చికిత్స విధానం

చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. లక్షల మంది ప్రాణాలను కబళించిన ఈ మాయలమారి ప్రజల ఆరోగ్యాన్నే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం ఛిన్నాభిన్నం చేస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ఎప్పటికీ ఈ ప్రపంచాన్నుంచి నిష్క్రమించకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ లేని పరిస్థితుల్లో ప్రజల్లో అందుకు అనుగుణంగా వ్యాధి నిరోధక శక్తి స్థాయి పెరిగేందుకు సుదీర్ఘ సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. "గతంలో వచ్చిన హెచ్ఐవీ ఇప్పటికీ తొలగిపోలేదు. వ్యాక్సిన్ రాలేదు కానీ మెరుగైన చికిత్స విధానం మాత్రం అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ కూడా అంతేనని భావిస్తున్నాం. ఇది మానవాళిని అంటిపెట్టుకునే ఉంటుందనిపిస్తోంది" అని పేర్కొన్నారు.