ఆటోలు, ట్యాక్సీలకు గుడ్‌న్యూస్.. - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

ఆటోలు, ట్యాక్సీలకు గుడ్‌న్యూస్..


హైదరాబాద్‌ :  హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ట్యాక్సీ, ఆటోల్లో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల అన్ని షాపులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరిబేసి సంఖ్యలో మాత్రమే షాపులు తెరవాలన్నారు. అలాగే కట్టడి ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో సెలూన్లు ఓపెన్‌ చేయొచ్చని తెలిపారు. ఈ- కామర్స్‌ సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం పనిచేస్తాయన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లు పనిచేస్తాయని వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 31 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. అన్ని ప్రార్థనా
మందిరాలకు అనుమతి లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.