ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం :కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం :కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు


 
కైకలూరు :  ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం అని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు  అన్నారు. సోమవారం వెలుగు ప్రాజెక్టు ద్వారా బత్తాయి పండ్లను  సబ్సిడీ పై విక్రయిస్తున్న  మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని మ్మెల్యే పరిశీలించారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వ  ఆదేశాల మేరకు  డ్వాక్రా, వెలుగు ప్రాజెక్టు ద్వారా బత్తాయిపండ్లను ప్రజలకు కిలో 16 రూపాయలు చొప్పున అందించగా, కరోనా మహమ్మారి కారణంగా  ప్రభుత్వమే కిలోకి 5 రూపాయలు సబ్సిడీ ఇచ్చి, 11 రూపాయలు చొప్పున ప్రజలకు నేరుగా అందిస్తుందని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం,   ఎపిఎం  హెడ్వార్డ్,  వెలుగు సీసీ లు , VMBK తదితరులు పాల్గొన్నారు.