మామిడి లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా.... - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

మామిడి లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్ బోల్తా....


జగిత్యాల :  జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్ లో గల ఎస్పీ బంగ్ల  ముందు కరీంనగర్ నుండి జగిత్యాల మామిడి మార్కెట్ కు లోడ్ తో వెళ్తున్న టాటా ఎసి ఆటో టైర్ పగలడం తో డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా  పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి రూరల్ సిఐ , ఎస్సై చేరుకొని ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు తన మామిడి కాయలు జగిత్యాల మామిడి మార్కెట్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది..ఆసమయంలో ఆటో లో డ్రైవర్ తో సహా ముగ్గురు ఉన్నారు.