కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌

                                                కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ కొనసాగుతోంది. ఈనెల 12వ తేదీన ప్రారంభమైన వ్యాల్యూయేషన్‌కు కొన్నిచోట్ల సిబ్బంది హాజరు తక్కువగా ఉండగా అధికారులు ఆదేశాలతో తిరిగి పుంజుకుంది. గురువారం మూడో స్పెల్‌ సబ్జెక్టులు తెలుగు, హిందీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, మైనర్‌మీడియా సబ్జెక్టులు ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో మొత్తం మూడు స్పెల్స్‌ పరీక్ష సిబ్బంది విధుల్లోకి చేరారు. కాగా ఆయా వాల్యూయేషన్‌ సెంటర్లను బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సందర్శించారు. ఈసందర్భంగా హైదరాబాద్‌ క్యాంప్‌ కేంద్రంలోని ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆదిలాబాద్‌లో 943 మంది ఎగ్జిబినర్‌లు రిపోర్ట్‌చేయగా, మెదక్‌లో 745 మంది, రంగారెడ్డి జిల్లాలో 610, నిజామాబాద్‌లో 965, మహబూబ్‌నగర్‌లో 1,189, కరీంనగర్‌లో 1251, వరంగల్‌లో 1,975, నల్గొండలో 1,687, హైదరాబాద్‌లో 737 మంది, మేడ్చల్‌లో 677 మంది, వోకేషనల్‌/ మైనర్‌మీడియాకు సంబంధించి 236 మంది హాజరైనట్టు అధికారులు తెలిపారు.