రైలులో బిడ్డను ప్రసవించిన వలసకూలీ - V2News

Latest News

V2News

Wednesday, May 20, 2020

రైలులో బిడ్డను ప్రసవించిన వలసకూలీ


పట్నా : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి వలసకార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ నుంచి బిహార్‌లోని సీతామర్హికి  శ్రామిక్‌ రైలులో వెళ్తున్న వలసకూలీల్లో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికులు  తోడ్పాటునందించడంతో ఆ మహిళ రైల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారమందుకున్న రైల్వే అధికారులు వెంటనే వైద్యులను పంపి దనాపూర్‌ రైల్వేస్టేషన్‌లో తల్లీబిడ్డలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తల్లీ బిడ్డా.. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా.. సోమవారం బిహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. త్రిపుర రాష్ట్రం అగర్తల నుంచి బిహార్‌కు శ్రామిక్‌ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆడశిశువుకు జన్మినిచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 31 తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.