పరిశ్రమల యాజమాన్యాలు.. ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి : కైకలూరుఎమ్మెల్యే డిఎన్నార్ - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

పరిశ్రమల యాజమాన్యాలు.. ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి : కైకలూరుఎమ్మెల్యే డిఎన్నార్

కైకలూరు  మండలంలోని ఆలపాడు గ్రామంలోని, శ్రీకాంత్ ఇంటర్నేషనల్ రొయ్యల ఫ్యాక్టరీలో, ఐశ్వర్య ఇంపెక్స్ లో  శుక్రవారం రాత్రి గ్యాస్ పైపు 5 ఎం ఎం మేర లీక్ అయింది అని సమాచారం తెలియగానే శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు  స్థానిక C. I. తో కలిసి  వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఫ్యాక్టరీ లో పనిచేసే వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడారు. ఈ  దర్బంగా  శాసనసభ్యులు మాట్లాడుతూ ఎవరికి ఏటువంటి ప్రాణనష్టం జరగలేదని, అక్కడ పరిస్థితి అంత బాగానే వుంది అని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది జరగలేదని అన్నారు.  యాజమాన్యం ,  ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు.  ఈకార్యక్రమంలో కంపెనీ MD.విశ్వనాధం సత్యనారాయణ, జనరల్ మేనేజర్, శివరామ్ ప్రసాద్, మోహనరావు, నాయకులు, ముంగర నరసింహ, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.