ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం... కూలిన చెట్లు 
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై గాలి దుమారం చెలరేగింది. ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో ప్రజలు సేద దీరారు. హర్యానా, ఢిల్లీ, చండీగఢ్‌లలో భారీ గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అలాగే, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, నగరంలో వీచిన బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి.