డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు

 భారత్ లో ఉన్న మా మిత్రులకు వెంటిలేటర్లు పంపిస్తున్నందుకు గర్విస్తున్నామంటూ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిపై అందరం సమష్టిగా యుద్ధం చేస్తున్నామని, విపత్కర పరిస్థితుల్లో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయడం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ప్రపంచ మానవాళి కరోనా నుంచి విముక్తం కావాలంటే దేశాలన్నీ శక్తివంచన లేకుండా శ్రమించాలని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా, భారత్, అమెరికా మైత్రి మరింత బలోపేతం కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.