బిగబాస్2 విన్నర్, ప్రముఖ బీజేపీ నాయకుడు, సినీ నటుడు కౌశల్ మండా పుట్టిన రోజు వేడుకలు నిన్న అబ్దుల్లాపూర్ గుడ్ షెఫర్డ్ వసుధైక ఉమ్మడి కుటుంబంలో ఘనంగా జరిగాయి. చిన్నారులకు ఈ సందర్భంగా కౌశల్ చికెన్ బిర్యానీ ప్రయోజితం చేశారు. ఆయనే స్వయంగా పిల్లలకు వడ్డన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల మధ్య తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రేఖా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో బిజీగా ఉండే సెలెబ్రిటీ కౌశల్ ఇంతదూరం వచ్చి చిన్నారులతో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం కౌశల్ తాను కరోనాపై నటించిన సందేశాత్మక "ఫైట్ విత్ కరోనా" అనే వీడియో పాటను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో సురక్ష సేవా సంఘం అధ్యక్షుడు గోపి శంకర్ యాదవ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, వీరాస్వామి, రాషద్, ప్రవీణ్, అనిల్, గోకుల్, లింగం, కౌశల్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు.