ముస్లింలను శ‌త్రువులుగా చూడొద్దు : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు‌ - V2News

Latest News

V2News

Wednesday, May 20, 2020

ముస్లింలను శ‌త్రువులుగా చూడొద్దు : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు‌

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, పెద్ద‌వంగ‌ర‌ మండ‌ల కేంద్రాల్లో ముస్లింల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులను పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేర్లేవైనా దేవుడు ఒక్కరే అన్నారు. నేను అందరి దేవుళ్లకు మొక్కుతూ వ‌రుస‌గా గెలుస్తున్నా.. ముస్లింలను శ‌త్రువులుగా చూడొద్దన్నారు. ముస్లింల వ‌ల్లే క‌రోనా విస్తృతి అయింద‌న‌డం పూర్తిగా నిజం కాదన్నారు. ఒక‌రిద్దరు చేసిన త‌ప్పుని అంద‌రికి రుద్దొద్దని హితవు పలికారు. కొద్ది రోజులు మ‌నం క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుందని, జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్లాలని తెలిపారు.
 కేంద్ర ప్రభుత్వం తీరుపై మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంది బొంద మీది ప్యాకేజీ అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కుద‌వ పెడితే అప్పులిస్త‌ర‌ట‌. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆదుకోవాల్సింది పోయి.. అక్క‌ర‌కురాని ప్యాకేజీలు ప్ర‌క‌టించారని బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల‌కు దిక్కులేదని, రైతుల పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ‌ను ఆద‌ర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. డిమాండ్ ఉన్న పంట‌ల‌నే వేసి రైతుల జీవితాల‌ను బంగారుమ‌యం చేసుకుందామని పేర్కొన్నారు.