అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు : ఏమ్మెల్యే నన్నపనేని నరేందర్ - V2News

Latest News

V2News

Wednesday, May 20, 2020

అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు : ఏమ్మెల్యే నన్నపనేని నరేందర్

వరంగల్ తూర్పు: లాక్ డౌన్ నేపథ్యంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మరోవైపు ప్రభుత్వం కృషికి తోడు దాతలు, స్వచ్ఛంద సంస్థలు మేము సైతం అంటూ ముందుకొచ్చి తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. తాజాగా వరంగల్ తూర్పులోని దేశాయిపేటలో పెద్ద ఎత్తున నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సమక్షంలో  ఏమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో  పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు