దుబ్బాక : ప్రజలు,
రైతులంతా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్
రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్ మీరాపూర్
లో బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు
12వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటరీ-1, 6 ఆర్ కాలువ నిర్మాణ
పనులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి
ప్రారంభించారు.
ఈ
సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ వాన కాలంలోపే
మన ప్రాంత చెరువులు నింపుకుని, రైతులకు రెండు పంటలు పండాలన్నదే
సీఏం కేసీఆర్ ఆశయమని, ఇందుకు అనుగుణంగా స్థానిక సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఇతర
ముఖ్యులు ముందుకొచ్చి పనులు వేగవంతం చేసేందుకు
సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. దాదాపు 170 కిలో మీటర్ల ప్రయాణం
తర్వాత గోదావరి జలాలు దుబ్బాక ప్రాంతానికి
వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి రైతుకు సాయం
అందిస్తుందని, చట్ట ప్రకారం రావాల్సిన ప్రతి
పైసా రైతులకు త్వరితగతిన చెల్లిస్తామని మంత్రి
భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్
ఎస్ఈ ఆనంద్, డీఈ రవీందర్ రెడ్డి,
ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.