బ్రెజిల్‌లో 24 గంటల్లో 800 మరణాలు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

బ్రెజిల్‌లో 24 గంటల్లో 800 మరణాలు




V2 డెస్క్ : బ్రెజిల్‌లో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 14,919 నమోదవ్వగా 800 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య అక్కడ 15,600 చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో 2,300 వైరస్‌ అనుమానిత మరణాలు సంభవించాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులను కలిపితే బ్రెజిల్‌లో బాధితుల సంఖ్య 2,33,142కు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు రోజు సైతం 15000 వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా, 800 మందికిపైగా మృతిచెందారు