కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు
* 20కోట్ల జన్‌ధన్‌ఖాతాల్లోకి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద నగదు బదిలీ చేశాం. డీబీటీ విధానం వల్ల లబ్దిదారుల ఖాతాల్లోకే నేరుగా నిధుల బదిలీ సాధ్యమైంది.

* 12లక్షలమంది ఈపీఎఫ్‌లో చందాదారులు ఆన్‌లైన్‌ ఉపసంహరణలతో  రూ.3,660 కోట్ల నగదు వెనక్కు తీసుకునే అవకాశం కల్పించాం.

*  కరోనా మహమ్మారి కమ్మేసిన సంక్షోభంలో సాంకేతికత సంస్కరణల సాయంతోనే ఎంతో మేలు జరిగింది.
* భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమ చేశాం.

* విద్యారంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం. విద్యారంగం కోసం ఇప్పుడున్న 3 ఛానెళ్లకు అదనంగా మరో 12 స్వయంప్రభ ఛానెళ్లు ఏర్పాటు. విద్యార్థుల కోసం కరిక్యులమ్‌, ఆన్‌లైన్‌ కరిక్యులమ్‌.

* ఉపాధిహామీ పథకానికి అదనంగా రూ. 40వేల కోట్ల కేటాయింపులు
నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపు చేరుకున్నాం

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు..

* భూమి, శ్రామిక శక్తి, నగదు లభ్యత, విధాన నిర్ణయాల్లో సంస్కరణలు. ఈ నాలుగు అంశాల్లో పలు కీలక నిర్ణయాలు ఇప్పటికే ప్రకటించాం.

* దేశంలో ప్రతి మూలకు ఆహారధాన్యాల సరఫరా చాలా కీలకమైన సవాల్‌. రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి.

* వలస జీవుల ఆకలి తీర్చటంలో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి.

* ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ.

* సాంకేతిక పరమైన సంస్కరణలు జరగకపోయి ఉంటే అది సాధమయ్యేదే కాదు.

* ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, సంక్షేమ పింఛన్లు రూపంలో వేల కోట్లరూపాయల బదిలీ చేశాం.

* లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపు చేరుకున్నాం