DNR సమక్షంలో YSCP లోకి దేవపూడి గ్రామ ప్రముఖులు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

DNR సమక్షంలో YSCP లోకి దేవపూడి గ్రామ ప్రముఖులు

V2డెస్క్ : కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు  సమక్షంలో ముదినేపల్లి మండలం
దేవపూడి గ్రామ ప్రముఖులు,  పన్నాస ప్రవీణ్ ,జోగి సురేష్ , దాసరి పార్ధసారధి , దాసరి నాగబాబు YSCP లో చేరారు. వారికీ MLA కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో DNR మాట్లాడుతూ, ప్రియతమ యువ ముఖ్యమంత్రి   YS జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న పరిపాలన చూసి,  పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను నేరుగా అందించాలని, వారు కూడా వారి గ్రామంలో గౌరవ జగనన్న నాయకత్వంలో పని చేయడానికి వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రామిశెట్టి సత్యనారాయణ, ఉల్లంకి నగేష్, పన్నాస బుజ్జి, ఈడే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు