కల్యాణ లక్ష్మీ షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
మెదక్ జిల్లాటెక్మాల్ మండలం:
మండలం లోని టేక్మాల్, బోడ్మట్ పల్లి, బర్దిపూర్, కాదులూర్, సర్మనీకుంట తాండ, వెంకట పూర్, పాల్వంచ, మాల్కాపూర్, కుసంగి, చంద్రు తాండ, అచ్చన పల్లి ,హసద్ మహ్మద్ పల్లి, ఎలకుర్తి, కమ్మరి కత్త, షాబాద్ తండా, వేల్పుగొండ, ఎల్లుపెట్, బోడగట్టు గ్రామాలలో కల్యాణ లక్ష్మీ / షాది ముభారక్ లబ్దిదారులకు మొత్తం 55 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.అలాగే టేక్మాల్ మండల కేద్రంలో విత్తనాలు, ఎరువుల కేంద్రాన్నీ, షాబాద్ తండా గ్రామ పంచాయితీ, బోడగట్టు లో డంపింగ్ యార్డ్ ప్రారంభించారు అందోల్ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు.ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతు : కరోనా కష్టసమయంలో ఒకరితోమరొకరు కలిసి మాట్లాడే పరిస్థితి కూడ లేదు అందుకని మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఈ కష్టసమయంలో లక్ష్మ నూటపదహార్లు సహాయనికి ఉపయోగపడతాయి అని అన్నారు. అమ్మాయిల పుట్టుక పట్ల వివక్ష ఎవరు చూపకుడదని పేదింటి అమ్మాయిల పెళ్లి భారం కాకూడదని కల్యాణ లక్ష్మీ / షాది ముభారక్ పథకాల ద్వార వారిని కేసీఆర్ ప్రభుత్వం అదుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ సూచించిన పంటలు వేసి తెలంగాణ వ్యవసాయంలో దేశానికె ఆదర్శంగా నిలవాలని టేక్మాల్ మండల కేంద్రంలో PACS ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు, కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించిన సందర్భంలో అన్నారు.పల్లెలు పరిశుభ్రంగ ఉండాలని కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామ పంచాయితీకి డంప్ యార్డ్ ఉండాలని. ప్రతి ఒక్కరు తడి పొడి చేతను వేరు చేసి మీ ఇంటి వద్దకు వచ్చే గ్రామ పంచాయతీ రిక్షా వారికి ఇవ్వాలని అతను చెత్తను డంప్ యార్డ్ కి చేరుస్తారని అన్నారు. చెత్తద్వార కూడ వార్మి కంపోస్ట్, కరెంటు ఉత్పత్తి అవుతున్న విషయాన్ని గుర్తు చేసారు.ఈరోజు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ కో-అప్షన్ మెంబెర్ యూసుప్, తెరాస మండల అధ్యక్షుడు వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్,AMC వైస్ చైర్మన్ విక్రమ్ గౌడ్, యం.ఆర్.ఓ గ్రెసి బాయ్, ఎం.పీ.డీ.ఓ హిరణ్మయి, ప్యాక్స్ చెర్మెన్ యశ్వంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రాజేందర్, సత్యం, సిద్దన్న, భాస్కర్ తదితరలు పాల్గొన్నారు.