ఎవరెస్ట్ పర్వతారోహకుడు ప్రవీణ్ పై దాడి - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

ఎవరెస్ట్ పర్వతారోహకుడు ప్రవీణ్ పై దాడి



                       తుర్కపల్లిలో భూ వివాదం  - ఒకరికి కత్తిపోట్లు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 

  నారాయణఖేడ్ పొలం ఒడ్డు విషయంలో వివాదం నెలకొని ఇరు వర్గాలు ఘర్షణ  పడడంతో ఒకరు కత్తిపోట్లకు గురి కాగా మరో ఇద్దరికి తీవ్య గాయాలైన సంఘటన బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలోచోటు చేసుకుంది .
           పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ప్రవీణ్ , తుర్కపల్లి తండాకు చెందిన మారుతిల పొలం పక్కపక్కన ఉండడంతో పొలం ఒడ్డు విషయమై గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. క్రమంలో బుధవారం పొలంలో కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తడంతో .. కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు . ఘటనలో మారుతి కి , ప్రవీణ్, అతని తమ్ముడు ప్రశాంత్ లకు తీవ్ర గాయాలయ్యాయి . గాయపడిన  వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్యికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ ఎవరెస్ట్  పర్వతారోహకుడు కావడం గమనార్హం.