జూన్‌ మొదటి వారం తర్వాత టీఎస్‌ ‘పది’ పరీక్షలు - V2News

Latest News

V2News

Tuesday, May 19, 2020

జూన్‌ మొదటి వారం తర్వాత టీఎస్‌ ‘పది’ పరీక్షలు



హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.  లోకల్ టైమ్స్ ప్రతినిధి