బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అంపన్’ పెనుతుపాను తీవ్ర భీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాను 1999 తరువాత రెండో అతిపెద్దదని తాజాగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో ప్రస్తుతం తీరం వెంబడి 200-240కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్యదిశగా కదులుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ‘అంపన్’ తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పశ్చిమబంగాలోని డిగా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వాతావరణశాఖ హెచ్చరికలతో ఇప్పటికే తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వాతావరణశాఖ హెచ్చరికలతో ఇప్పటికే తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.