సహకారం అందించిన దాత శ్రీ కోటే రామచంద్రరావు MLA DNR కృతజ్ఞతలు - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

సహకారం అందించిన దాత శ్రీ కోటే రామచంద్రరావు MLA DNR కృతజ్ఞతలు


కైకలూరు : విపత్కర పరిస్థితులలో మేము సైతం అంటూ స్పందించి సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తున్న దాతలకు  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు,విశ్వనాద్రిపాలెం గ్రామ ప్రముఖులు,శ్రీ కోటే రామచంద్రరావుగారు ,ఈరోజు కైకలూరులో,ఎమ్మెల్యే శ్రీ డిఎన్నార్ ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.9.999 అక్షరాల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయల చెక్కును అందజేశారు.. సందర్భంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ.. ఇటీవల  పత్రికాముఖంగా తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు తమకు వీలైనంతలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని కోరారు.కనీ వినీ ఎరుగని దుర్భర పరిస్థితులలో మీరిచ్చే సాయం రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఇటీవల తాను కోరిన విధముగా ఆక్వా వ్యాపార,వాణిజ్య వర్గాలు,పారిశ్రామికవేత్తలు, రైతులు,విద్యాసంస్థలు "CHIEF MINISTER RELIEF FUND, ANDHRAPRADESH, పేరిట చెక్కుల రూపంలో విరాళాలు అందించి సహకరించ వలసినదిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని డిఎన్నార్ తెలిపారు.